Site icon NTV Telugu

CM Chandrababu: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై సీఎం సమీక్ష.. అలర్ట్‌ గా ఉండండి..!

Cbn

Cbn

CM Chandrababu: ఎండలు మండిపోతున్నాయి.. మరోవైపు.. ప్రస్తుతం అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. తీవ్రస్థాయిలో పంట నష్టం అయినట్టు లెక్కలు చెబుతున్నాయి.. అయితే, మార్చిలోనే ఎండలు దండిచొడుతున్నాయి.. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఇక, ఏప్రిల్‌, మే నెలల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది.. ఈ సారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతాయనే అంచాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. వేసవి కారణంగా నీటి ఎద్దటి సమస్య, వడగాల్పులు, ఎండల ప్రభావం వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ రాజ్, మున్సిపల్‌, ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు ఏంటి.. ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే విధానాలు ఏంటి? అనే దానిపై చర్చించారు.. హీట్ వేవ్ సమాచారాన్ని ప్రజలకు రియల్ టైంలో షేర్ చేయడం ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Tamim Iqbal: మైదానంలోనే కుప్పకూలిన తమీమ్‌ ఇక్బాల్‌.. పరిస్థితి విషమం!

Exit mobile version