Site icon NTV Telugu

CM Chandrababu: సీఎం చంద్రబాబు వైజాగ్‌ టూర్ రద్దు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టి విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్‌ ప్రకారం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్‌లో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం.. మరోవైపు, విమాన ప్రమాదం ఘటనతో.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట కూటమి ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన కార్యక్రమం కూడా రద్దు చేశారు.. ఇక, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం.. ఈ ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని కీలక అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది..

Read Also: Astrology: జూన్‌ 13, శుక్రవారం దినఫలాలు

కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమానం ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం విదితమే.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలి తీవ్ర విషాదాన్ని నింపింది.. మృతుల్లో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్న విషయం విదితమే.. కాగా, 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌వాసులు, ఏడుగురు పోర్చుగల్‌వాసులు, ఒకరు కెనడా పౌరుడు. ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, ఈ ఘటనలో బ్రిటన్‌లో స్థిరపడ్డ రమేష్‌ విశ్వాస్‌కుమార్‌ బుచర్వాడ అనే ప్రయాణికుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విషయం విదితమే..

Exit mobile version