Site icon NTV Telugu

CM Chandrababu Bhogi 2025 wishes: భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోవాలి.. సీఎం భోగి శుభాకాంక్షలు

Chandrababu

Chandrababu

CM Chandrababu Bhogi 2025 wishes: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు.. ”రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ అందరికి మరొక్క మారు భోగి పండుగ శుభాకాంక్షలు.” అంటూ ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version