Site icon NTV Telugu

CM Chandrababu: పీ4 లోగో ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

P4 Logo

P4 Logo

CM Chandrababu: పీ4పై అధికారులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పీ4 లోగోను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు.. #IAmAMaragadarsi క్యాప్షన్‌తో పీ4 లోగోను ఆవిష్కరించారు. అయితే, ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నట్లు వివరించారు. బంగారు కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Liquor Bottle Size: లిక్కర్ ఫుల్ బాటిల్‌ 750 ml మాత్రమే ఎందుకు ఉంటుంది..?

Exit mobile version