CM Chandrababu : కొత్త ఐటీ పాలసీపై సీఎం ఫోకస్.. నేడు కీలక సమీక్ష
- ఐటీ-ఎలక్ట్రానిక్స్.. ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం సమీక్ష..
- ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చ..
- విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులను రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలు సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు.. ఈ రోజు ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం.. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఐటీ పరిశ్రమలను తిరిగి రప్పించేలా చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీతో సమానంగా హార్డ్ వేర్ రంగం నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలని భావిస్తోంది ప్రభుత్వం.. ఆర్టీజీ వ్యవస్థను ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశంపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నేడు విచారణ..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
కాగా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది.. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు.. అయితే, ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది టీడీపీ-జనసేన-బీజేపీ.. దీంతో.. గతంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇదే సమయంలో.. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. ఆ దిశగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తోంది కూటమి ప్రభుత్వం..
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!