Site icon NTV Telugu

CM Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు.. సీఎం సమీక్ష

Cbn

Cbn

CM Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు..

Read Also: Biggest Multistarrer : మహేశ్.. రజనీకాంత్.. రామ్ పోతినేని.. ఫిక్స్ ?

వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలి. ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా ఎమ్యునరేషన్ జాగ్రత్తగా చేయాలన్నారు చంద్రబాబు.. ఈ రోజు సాయంత్రానికి వీధుల్లో నీళ్లన్నీ క్లియర్ అయిపోతాయి. పారిశుధ్యం పనులు నిరంతరం కొనసాగాలన్న ఆయన.. నిత్యవసర సరుకులు పంపిణీ బాగా జరుగుతోంది. నేటి సాయంత్రానికి సరుకుల పంపిణీ కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.. విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలుగుతాం. మనది తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతం.. దానికి అనుగుణంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలన్నారు..

Read Also: Big Breaking: హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి అనుమతిలేదు.. ట్యాంక్‌బండ్‌పై ఫ్లెక్సీలు..

ఇక, వర్ష సూచన ఉన్న జిల్లాల అధికారులను ముందుగానే అలెర్ట్ చేయడం వల్ల ప్రాణనష్టం తప్పిందని సీఎం చంద్రబాబుకు తెలిపారు ఆయా జిల్లాల అధికారులు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈస్ట్, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతామారామరాజు, కాకినాడ జిల్లాల్లో ముందస్తు చర్యలతో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయనా ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.. అయితే, జిల్లా కలెక్టర్లు అప్రమత్తత కొనసాగాలన్న సీఎం చంద్రబాబు నాయుడు.. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వాగులు, వంకల పరిస్థితిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

Exit mobile version