NTV Telugu Site icon

CM Chandrababu: ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష.. ఆ నిధుల పరిస్థితి ఏంటి..?

Cbn

Cbn

CM Chandrababu: ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి.. సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. అయితే, కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలపగా.. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఆ నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఈ రివ్యూకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Read Also: Ambati Rambabu: జైలు నుంచి పోసాని విడుదలలో జాప్యం..! అంబటి సంచలన ఆరోపణలు..