Site icon NTV Telugu

CM Chandrababu: వ్యర్థాల నుంచి సంపద సృష్టిపై సీఎం సమీక్ష.. 11 రంగాలపై ఫోకస్‌..

Cbn

Cbn

CM Chandrababu: సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ సర్కార్‌ దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఫోకస్‌ పెట్టింది.. మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం.. నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి చేస్తోంది ఏపీ సర్కార్‌..

Read Also: Trump Mobile 5G: మొబైల్ మార్కెట్‌లోకి ట్రంప్ ఫ్యామిలీ ఎంట్రీ.. ట్రంప్ మొబైల్ 5G నెట్‌వర్క్ ప్రారంభం..!

Exit mobile version