CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించి, ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 393 నెంబరుతో ఉండే ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబాసిడర్ కాన్వాయ్‌లో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. . ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు… భధ్రతా పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నా… తన సొంత కారు అయిన నాటి అంబాసిడర్ ను మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న ఈ కారును అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇకపై ఉంచనున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చి… తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారును పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు… ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. “with my old friend..!” అంటూ రాసుకొచ్చి.. 393 అంబాసిడర్ కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
….. with my old friend! pic.twitter.com/VJbB9keeE3
— N Chandrababu Naidu (@ncbn) October 31, 2025
