NTV Telugu Site icon

Chandrababu Serious on TG Bharath: కాబోయే సీఎం లోకేష్..! మంత్రి టీజీ భరత్‌పై చంద్రబాబు సీరియస్‌..

Babu

Babu

Chandrababu Serious on TG Bharath: అసలే నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్‌పై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటూ టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి.. ఇది జరిగి.. కనీసం రెండు గంటలు అయినా గడవక ముందే మంత్రి టీజీ భరత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.. ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్‌ ఈజ్ లోకేష్‌.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్‌ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్‌.. జ్యూరిచ్ లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు ‘మీట్‌ అండ్‌ గ్రీట్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మంత్రి టీజీ భరత్‌ ఆ వ్యాఖ్యలు చేశారు.. అయితే, నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ దావోస్ వేదికగా మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఉన్న వేదికపై వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎలాంటి వేదికలపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నావని టీజీ భరత్ పై మండిపడ్డారట.. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీజీ భరత్ కు సూచించారు సీఎం చంద్రబాబు..

Read Also: Gandhi Tatha Chettu: చెట్టుకు, మనిషికి లవ్‌స్టోరీ.. సుకుమార్ కుమార్తెకు అందుకే గుండు: పద్మావతి మల్లాది ఇంటర్వ్యూ

కాగా, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ఫ్యూచర్‌ ఈజ్‌ సేఫ్ హ్యాండ్‌ అన్నారు మంత్రి టీజీ భరత్.. పెట్టుబడులు పెట్టేవారికి ఎవరికీ ఎలాంటి భయాలు అవసరంలేదన్నారు.. ఏపీని తెలుగుదేశం పార్టీ కొన్ని దశాబ్దాలు పాలిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. దీ మోస్ట్‌ డైనమిక్‌, యంగ్‌ లీడర్‌ మా నారా లోకేష్‌ అన్నారు మంత్రి టీజీ భరత్‌.. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి.. ఏపీ నుంచి ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదవిని వ్యక్తి లోకేష్‌ మినహా ఎవరూ లేరని తెలిపారు.. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది మాకు లాంగ్‌ విజన్‌ ఉంది.. ఫ్యూచర్‌ తెలుగుదేశం పార్టీకే ఉంది.. మా పార్టీలో క్లారిటీ ఉంది.. ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా.. ఫ్యూచర్‌ ఈజ్‌ లోకేష్‌.. కాబోయే ముఖ్యమంత్రి లోకేష్‌.. ఫ్యూచర్‌లో అని స్పష్టం చేసిన విషయం విదితమే..