CM Chandrababu Singapore Visit: సింగపూర్‌లో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ..
- రెండో రోజు సింగపూర్ పర్యటనలో సీఎం బిజీబిజీ..
- వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
- సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 బిజినెస్ రోడ్ షోకు హాజరుకానున్న సీఎం..
- రాష్ట్రానికి పెట్టుబడులు - అమరావతి అభివృద్ధిపై వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Singapore Visit: సింగపూర్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనగా మంగళవారం రోజు వివిధ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీకండక్టర్ రంగ విస్తరణే లక్ష్యంగా పలు అంతర్జాతీయ ప్రతినిధుల బృందాలు, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు. ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్‌పై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. తర్వాత సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలపై సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తారు.
ఇక, మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు… అలాగే వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో లీడర్షిప్ ప్లీనరీ-2 విభాగంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ స్టాళ్లు, సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను పరిశీలిస్తారు. సాయంత్రం సీట్రియం ప్రతినిధులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. అనంతరం ఐహెచ్సీ, సీఐఐ పీఎస్ 2026 బిజినెస్ రోడ్‌షోలో పాల్గొని ఏపీ వ్యాపార ప్రతినిధుల బృందంతో కలిసి పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చిస్తారు. దీంతో రెండు రోజుల సింగపూర్ పర్యటన ముగుస్తుంది. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో మంత్రి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.. రేపు రాత్రికి సింగపూర్ నుంచి తిరుగు ప్రయాణమై సీఎం చంద్రబాబు స్వదేశానికి చేరుకుంటారు.
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
- CM Chandrababu: ఎల్ నినో ప్రభావం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
- TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!