CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు.. అయితే, కేబినెట్‌లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రుల తో ప్రస్తావించారు.. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, లిక్కర్ కేసు విషయంలో మంత్రులు ఆచి తూచి స్పందించాలన్నారు. లిక్కర్ కేస్ సున్నితమైన అంశం కాబట్టి మంత్రులు కూడా.. దానిపై అతి స్పందించవద్దని.. ఏదిపడితే అది మాట్లాడొద్దని.. ఆచి తూచి స్పందించాలి అన్నారు సీఎం చంద్రబాబు.. అదే సమయంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని కూడా ఖండించాలి.. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలకు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: CPM Letter To Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సీపీఎం లేఖ.. పంచాయితీల సంగతి చూడండి..!
