Site icon NTV Telugu

CM Chandrababu: మంత్రులకు సీఎం దిశానిర్దేశం.. ఇక నుంచి దూకుడు పెంచాలి..!

Cbn

Cbn

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.. మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారు.. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సూచించారు.. తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తోంది.. వైసీపీ నేతల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. పోలీసులు, రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలి.. అంతర్జాతీయ సంబంధాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాం. సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు.. మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాల్సి ఉంటుందన్నారు.. ప్రజల్లో మన కూటమి ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది.. మంత్రుల పనితీరుతో ప్రజల్లో మరింత సానుకూలత పెరగాలని స్పష్టం చేశారు.. జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలి.. తమ శాఖలపై మంత్రులు రిపోర్టు తయారుచేసుకోవాలన్నారు.. ఇక, వచ్చే కేబినెట్ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమశాఖ ఘనతపై మాట్లాడిస్తాం అని దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: PM Modi: గాల్వాన్ లోయ వివాదం తర్వాత.. తొలిసారి చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ

Exit mobile version