Chandrababu and Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..!
- ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
- ఉదయం 10.40 నుంచి 12 గంటల వరకు భేటీ..
- హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఉండవల్లి రానున్న పవన్..
- ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం లో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10.40కి సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి రానున్నారు.. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా నిన్న కేబినెట్లో చర్చించిన తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ నివేదిక.. అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది.
Read Also: Telangana BJP: బీజేపీకి జనసేన సపోర్ట్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి గత నాలుగు రోజులుగా… వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయి.. ఈ విషయాలు అన్నింటి మీద కూడా చర్చ జరగనుంది. దీంతోపాటు కూటమి నేతలు మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ప్రధానంగా చర్చిస్తారు.. టీటీడీ తిరుమల తిరుపతి లడ్డూ అంశానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ ఒక్కటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళనలో ఉంది.. దీంతోపాటు కూటమి మొత్తం కలిసి వస్తే గనుక తీవ్రత కొంచెం పెంచినట్టు అవుతుందని నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో చర్చకి వచ్చింది.. ఆ దిశగా చర్చ జరగనుంది. మూడు పార్టీలు కలిసి అందులో ప్రధానంగా జనసేన కూడా ఉంది కాబట్టి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లే విధంగా సీఎం.. డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది…
దీంతోపాటు త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకించి చర్చించే అవకాశం ఉంది.. కూటమిలో నాలుగు స్థానాలు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.. కాబట్టి కూటమిలో టీడీపీకి రెండు, జనసేనకి ఒకటి, బీజేపీకి ఒకటి వచ్చే అవకాశం ఉంది.. కాబట్టి ఆ దిశగా కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది… దీంతోపాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తారు… త్వరలో మంత్రి మండలి విస్తరణ జరగచ్చని సమాచారం.. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అంబటి రాంబాబు నివాసంలో. జరిగిన దాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన చేస్తూ ఉన్నారు. దీంతో గుంటూరు జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయానికి సంబంధించి కూడా ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చకి వచ్చే అవకాశం ఉంది… అవసరం అయితే జిల్లా పర్యటనలు పవన్ చేసే విధంగా కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.. అంటే రాబోయే రోజుల్లో జగన్ తీసుకునే స్టాండ్ ఎలా ఉండనుంది.. అవసరమైతే పవన్ కల్యాణ్ కూడా జిల్లా పర్యటన చేయాలా లేకపోతే ఉమ్మడిగా కూటమి… పోరాటాలు.. చెయ్యాలా అనే అంశం పై… ప్రధానంగా చర్చకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఓవరాల్ గా నిన్న కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొంతమంది మంత్రులు కలిసి మాట్లాడుకున్నారు… ఇవాళ జరిగే సమావేశం కూడా కీలకంగా మారింది ..
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!