Help To The Flood Victims: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.. ఇప్పటకీ విజయవాడలోని చాలా కాలనీలను వర్షపునీరు వీడలేదు.. ఈ నేపథ్యంలో.. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్ కు అప్పగించారు.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
Read Also: Bone Health: బలమైన ఎముకలను పొందాలంటే ఇలా చేయక తప్పదు..
కాగా, కృష్ణా జిల్లాను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బెజవాడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో.. కొందరు పైఅంతస్థుల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు ఇళ్లను వదిలేసి.. సమీప ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. అజిత్ సింగ్ నగర్, కండ్రిగ ప్రాంతాలను వరద ముంచెత్తింది. ట్రాక్టర్లు, ప్రొక్లెయినర్లతో వరద బాధితులను తరలిస్తున్నాయి. దశాబ్దాల తర్వాత ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. విజయవాడను రికార్డు స్థాయి వర్షాలే ముంచేశాయి. భారీ వానతో విజయవాడ.. దాని పరిసర ప్రాంతాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి.
Read Also: Etela Rajender: కొట్టుకుపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి..
మరోవైపు ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.. ముంపు బాధితులకు డ్రోన్ల ద్వారా.. హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లు, తాగునీటిని సరఫరా చేస్తున్నారు.. అయితే.. అన్ని ప్రాంతాలకు ఇవి అందడంలేదనే ఆందోళన వ్యక్తం అవుతోంది.. మరోవైపు.. ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు అధికారులు సరైన రీతిలో స్పందించడంలేదనే సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయిన విషయం విదితమే.. ప్రభుత్వ ఆదేశాలను అనుగుణంగా పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఈ క్లిష్ట సమయంలో అధికారులు, అనధికారులు ప్రజాహితం కోసం పని చేయాలని, సాటి మనిషిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రాంతాలలో ఉన్నవారు ఒక్కో బాధిత కుటుంబానికి సాయం చేయాలని కోరారు.#APGovtWithFloodVictims pic.twitter.com/Ze84IzU17t
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 3, 2024