Site icon NTV Telugu

Drone Summit 2024: దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సమ్మిట్‌.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Drone Summit 2024

Drone Summit 2024

Drone Summit 2024: దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సమ్మిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం అయ్యింది.. మంగళగిరిలో డ్రోన్-2024 సమ్మిట్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీలో భారత్‌ దూసుకుపోతోందన్నారు.. అమెరికాలో ఉన్న కార్పొరేట్ సంస్ధలను కలిశాను.. ఇండియా టెక్నాలజీలో స్ట్రాంగ్ గా ఉంది.. ఇండియాలో మాత్రమే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడే వారున్నారు.. జీరో కనుగొన్నది ఇండియన్స్, ఇంగ్లీషు మాట్లాడే అధికులు ఇండియన్స్ అని బిల్ గేట్స్ కు చెప్పి ఒప్పించి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు తెచ్చాను అని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి ఒక డ్రోన్ సమ్మిట్ చాలా మంచిది.. ఇది ఒక మార్పు తీసుకొస్తుందన్నారు.. మనకు అడ్వాన్స్‌డ్ డ్రోన్స్, సీసీ కెమెరాలు, ఇతర ఐఓటీ పరికరాలు ఉన్నాయన్నారు.

Read Also: Jagga Reddy: కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్.. దండుపాళ్యం గ్యాంగ్గా మారింది..

జాబ్ అడిగే వారు కావద్దు.. జాబ్స్ ఇచ్చే వారిగా మారాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, తెలుగు కమ్యూనిటీ నుంచే 30 శాతం మంది జాబ్స్ ఇచ్చే వారుగా ఉన్నారన్న ఆయన.. ఎమిరేట్స్ నుంచి మొదటి ఫ్లైట్ హైదరాబాద్‌కు తెచ్చాం.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయిని ఒప్పించాను అన్నారు..

Exit mobile version