Site icon NTV Telugu

CM Chandrababu: నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వారిపై కఠిన చర్యలు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మధ్యం వ్యవహారం కలకలం రేపింది.. అయితే, రాష్ట్రంలో నకిలీ మద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రం అంతా కల్తీ మద్యం అంటూ ప్రజలను భయపెడుతున్నారు.. ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. అయితే, రాష్ట్రంలో మద్యం మరణాలపై విచారణ చేయాలని ఆదేశించారు.. ఇక, రాజకీయ కుట్రలతో కల్తీ మద్యం అంటూ.. మద్యం మరణాలు అంటూ తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: IND vs WI: కరేబియన్ క్రికెట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది.. డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు!

కాగా, రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారం కలకలం రేపగా.. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు భారీ షాక్ తగిలింది.. జయచంద్రా రెడ్డి, సురేశ్ నాయుడులను టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే.. ఇక, అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలకు గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..

Exit mobile version