Site icon NTV Telugu

CM Chandrababu: మహిళలపై అఘాయిత్యాలు.. సీఎం సీరియస్‌ వార్నింగ్‌

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా తేడా లేకుండా వరుసగా అఘాయిత్యాలు వెలుగు చూశాయి.. అయితే, మహిళలపై అత్యాచార ఘటనలపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేది లేదని హెచ్చరించారు.. పిల్లల తప్పు కూడా ఉండదు… మనమే మానసికంగా సరిదిద్దాలని సూచించారు.. అయితే, ఎవరైనా కరుడుగట్టిన నేరస్తులు ఉంటే చర్యలుంటాయి.. కరుడుగట్టిన నేరస్తులు ఉంటే వాళ్ల తాటతీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, అరవై శాతం భూ ఆక్రమణల పైనే తమకు ఫిర్యాదు వచ్చాయన్నారు సీఎం.. గ్రామాలలో రెవెన్యూ ఇబ్బందులపై ప్రత్యేక పరిష్కార మార్గాలు చూస్తాం అన్నారు.. విదేశీ మద్యం, స్టాండర్డ్ బ్రాండ్లు తీసుకొచ్చాం.. షాపు లైసెన్సులు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

Read Also: P. Chidambaram: ఢిల్లీ హైకోర్టులో కేంద్ర మాజీమంత్రి చిదంబరానికి బిగ్ రిలీఫ్

ఇక, ఎమ్మెల్యేలు కూడా తన మన లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.. 25 ఏళ్ల తాకట్టు పెట్టి మద్యం పైన అప్పులు తెచ్చారు.. ఇసుక రవాణా విషయంలో ఎవరైనా అడ్డు పడితే పిడి యాక్టు పెడతాం అని హెచ్చరించారు.. ఉచిత ఇసుక అమలు సరిగా జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. దీపం – 2 పధకం అమలు పూర్తిస్ధాయిలో జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.. ఉద్యోగాల కల్పన ప్రధాన ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.. 3,73,539 మందికి ఉద్యోగకల్పన ధ్యేయంగా పని చేస్తున్నాం.. ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకు ఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తాం అని ప్రకటించారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పైన మా ఆలోచన.. ఓర్వకల్లును డ్రోన్ సిటీగా తయారు చేస్తాం.. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు, టెక్నాలజీ అనుసంధానంతో చేస్తాం.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ను తీసుకొస్తున్నాం.. సోలార్ పేనెల్స్ పెడతాం.. కరంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version