NTV Telugu Site icon

CM Chandrababu: ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుంది

Babu

Babu

CM Chandrababu: ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో వివిధ అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయన.. ఉద్యోగాలు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త విధానాలను రూపొందించాం అన్నారు.. మొదటిగా వచ్చిన 200 పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాలు ఉన్నాయి.. 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తాం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాకాలు ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మలచాలన్నది మా లక్ష్యంగా పేర్కొన్నారు.

Read Also: Ameenpur: అమీన్పూర్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ముంపు బాధితుల ఆందోళన

ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ రూపకల్పన చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్రప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసుకుని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తామన్న ఆయన.. ఇలా ఓ 10 వేల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చేస్తాం.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా ప్రతీ ఉత్పత్తికీ ఓ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం అన్నారు. క్వాలిటీ, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.. పండించే పంటలకు విలువజోడిస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుంది.. విలువ జోడిస్తే ప్రపంచానికే ఫ్రూట్ బాస్కెట్ గా ఏపీ అవతరిస్తుందన్నారు.. ఇక ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని విధానం రూపోందించాం.. కొత్త పద్ధతుల్లో ఈ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అవుతాయన్నారు.

Read Also: Ameenpur: అమీన్పూర్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ముంపు బాధితుల ఆందోళన

అమరావతిలో భూ సమీకరణ అనేది ఒక భూ సేకరణ మోడల్ భూములు ఇచ్చిన రైతులు కూడా లాభపడాలి అన్నారు సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు మంజూరైంది.. మౌలిక సదుపాయాలు, అభివృద్ది ప్రాజెక్టులు చేపడతాం అన్నారు.. ప్రతీ నియోజకవర్గంలోనూ ఓ పారిశ్రామిక ఎకో సిస్టం రావాల్సిన అవసరం ఉంది.. వ్యవసాయంతో సమానంగా ఏపీలో పరిశ్రమలు కూడా రావాలి.. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలన్నది మా ప్రభుత్వ విధానం అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ లాంటి కొత్త ఇంధనాల ఉత్పత్తి చేసేలా కొత్త విధానం ఉపకరిస్తుంది.. వ్యవసాయం చేసుకునే రైతులు కూడా సౌర విద్యుత్ ఫలకాలు పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి విక్రయించొచ్చు అని పేర్కొన్నారు… గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ సంస్థ ముందుకు వచ్చింది.. ఈ నెల 29 తేదీన ఈ గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు.. మొత్తం 84,700 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడితో ప్రాజెక్టు వస్తుందన్నారు.. ఎన్టీపీసీతో పాటు ఏపీ జెన్కో కూడా సంయుక్తంగా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉంటారు.. రిలయన్స్ సంస్థ కూడా 65 వేల కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.. 2.5 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు వస్తాయని వివరించారు.

Read Also: Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో గందరగోళం.. కాంగ్రెస్ కౌన్సిలర్ రాజీనామా..

పబ్లిక్ పాలసీలన్నీ రాష్ట్ర భవిష్యత్ ను మార్చేలా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.. గతంలో చేసిన ఐటీ పాలసీ యువత భవిష్యత్ ను, ఏపీ దిశను మార్చేసింది.. వీటితో పాటు పర్యాటకానికి కూడా పెట్టుబడులు వచ్చేందుకు మంచి అవకాశాలున్నాయి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు ఉంది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Show comments