NTV Telugu Site icon

CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం ఫోకస్‌.. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే..!

Cbn

Cbn

CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా దృష్టి పెట్టారు.. ఏపీలో రెండు గ్రేడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇంచార్జ్‌ మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు పెట్టారు… ఎమ్మెల్యేలు.. కూటమి నేతలు కలిసి పని చెయ్యాలని. కూడా మంత్రులు చెబుతున్నారు.. తూర్పుగోదావరి – పశ్చిమగోదావరి.. కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రేడ్యుయేట్ ఎన్నికలతో పాటు.. విశాఖ – శ్రీకాకుళం – విజయనగరం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మంత్రులు నారాయణ.. నిమ్మల రామానాయుడు.. అనగాని సత్యప్రసాద్‌.. గొట్టిపాటి రవి ఇప్పటికే.. ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, మంత్రులతో పాటు కూటమి నేతలు కలిసి ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని.. అదే విధంగా ప్రభుత్వం.. యువతకు చేస్తున్న కార్యక్రమాలు.. ఉద్యోగాల కల్పన.. గ్రేడ్యుయేట్ ఓటర్లకి మంత్రులు చెప్పాలంటున్నారు సీఎం చంద్రబాబు… మంత్రులు కూడా ఇదే తరహా ప్రచారంపై దృష్టి పెట్టారు. కూటమి నేతలు కూడా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.. జనసేన. ఈ నెల 16, 17 తేదీల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహిస్తున్నారు.. అయితే. జనసేన విడిగా ఈ సమావేశం నిర్వహిస్తోంది… మంత్రులతో త్వరలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రుల కు చెబుతున్నారు.