NTV Telugu Site icon

Vana Mahotsavam: నేడు నరసరావుపేటకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌.. ఇదే తొలిసారి

Vana Mahotsavam

Vana Mahotsavam

Vana Mahotsavam: ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. నరసరావుపేట JNTU కాలేజీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మొక్కలు నాటనున్నారు. తర్వాత జేఎన్టీయూ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. జనసేన చీఫ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం..

Read Also: Joe Root: రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టిన రూట్!

నరసరావుపేట మండలం కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూ కశాళాల ప్రాంగణంలో ఆటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంల హోదాలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారు.. వేర్వేరుగా రెండు హెలిక్యాప్టర్లలో జేఎన్‌టీయూకు చేరుకోనున్నారు ఇద్దరు నేతలు.. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.. ముందుగా మొక్కలు నాటి వనమహోత్సావాన్ని ప్రారంభించిన తర్వాత .. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు.. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు..