Site icon NTV Telugu

CM Chandrababu Couple London Tour: రేపు లండన్‌కు చంద్రబాబు దంపతులు..

Cm Chandrababu Couple Londo

Cm Chandrababu Couple Londo

CM Chandrababu Couple London Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు లండన్‌ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు రాత్రి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లనున్నారు చంద్రబాబు.. వ్యక్తిగత పర్యటన తర్వాత పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.. రేపు రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్న చంద్రబాబు.. అయితే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ -2025కు ఎంపికయ్యారు నారా భువనేశ్వరి.. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోనున్నారు నారా భువనేశ్వరి.. రేపు రాత్రికి లండన్‌ బయల్దేరి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు.. లండన్ లో 4వ తేదీ జరిగే రెండు అవార్డుల కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు.. నవంబర్‌ 2వ తేదీ నుంచి చంద్రబాబు లండన్ పర్యటన ప్రారంభం కానుంది.. మరోవైపు, ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 2 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు చంద్రబాబు లండన్ పర్యటన కొనసాగనుండగా.. 6వ తేదీ తిరిగి అమరావతికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు..

Read Also: Mali Bamako JNIM: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని?

Exit mobile version