Site icon NTV Telugu

CM Chandrababu: పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి..

Cbn

Cbn

CM Chandrababu: అడవులు, పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. కొంతమంది మంత్రులు, అధికారులు కూడా పరిశీలించారు… ఇక, స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నల్లమల అడవుల పరిరక్షణకు జీవితం అంకితం చేసిన వ్యక్తి అంకారావు అని గుర్తుచేశారు.. అడవుల పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చెప్పినట్టు ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యంతో ఉన్నామని తెలిపారు..

Read Also: Hyderabad: హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ అల్ప్రాజోలం ట్యాబ్లెట్స్..

ఇక, అమరావతిలో కూడా రకరకాల గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నాం.. మియావాకి తరహాలో గార్డెనింగ్ ఉంటుంది అన్నారు సీఎం చంద్రబాబు.. రైతులకు కుసుమ పథకంలో బోర్ వెల్ ఏర్పాటు జరుగుతుంది. పంటలు. ఇళ్లకు కరెంట్ వాడుకునే అవకాశం ఉంటుంది.. కరెంట్ విషయంలో స్పష్టత ఉంది.. క్లీన్ ఎనర్జీ రావాలన్నారు.. మరోవైపు, ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా డే జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు.. రాష్ట్ర మొత్తం లక్ష కేంద్రాల్లో యోగా జరుగుతుందన్నారు.. 2 కోట్ల మంది మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుండి యోగాలో పాల్గొంటారు.. యోగాను ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version