NTV Telugu Site icon

CM Chandrababu: పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కీలక సమీక్ష.. ఆ కేసుల్లో దర్యాప్తుపై ఆరా..

Cbn 2

Cbn 2

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కీల కేసులపై దర్యాప్తు చేపట్టింది.. అయితే, ఆ దర్యాప్తులో ఇప్పటి వరకు సాధించిన పురోగతి ఏంటి? అంటూ ఆరా తీశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి డీజీపీ సీఎస్‌ సహా వివిధ దర్యాప్తు సంస్థల అధినేతలతో సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సమీక్షలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ చీఫ్ హరీష్ కుమార్ గుప్త పాల్గొన్నారు..

Read Also: Supreme Court: బుల్డోజర్‌ చర్యపై అస్సాంకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసు జారీ

ఇక, మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశామని సీఐడీ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు.. మదనపల్లెలో తగులబడిన ఫైళ్లు ఘటన దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు.. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. దర్యాప్తు సంస్థల అధినేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది..

Show comments