NTV Telugu Site icon

CM Chandrababu Tour: సీఎం చంద్రబాబు పర్యటనలో మార్పులు..

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది.. అయితే, ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సీఎం పర్యటించాల్సి ఉండగా.. అక్కడహెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి అనువుగా లేకపోవడతో పర్యటనలో మార్పు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా స్థానంలో సీఎం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం… ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరిన అనంతరం.. ఏరియల్ సర్వే ద్వారా కైకలూరు, కొల్లేరు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు హెలికాప్టర్ లో ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11. 25 గంటలకు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించి, 11:45 కు సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం చేరుకుంటారు. అక్కడ రైతులు వరద బాధితులతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు సీఆర్ రెడ్డి కళాశాల హెలిపాడ్ కు చేరుకొని హెలికాప్టర్లో సామర్లకోట వెళ్లనున్నారు.. సామర్లకోటలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.. ఏలేరు ఆధునీకరణ, తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Read Also: Central Team: నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన..

Show comments