AP Ministers Ranks: మంత్రులు తమ పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలంటూ.. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రులను ఆదేశిస్తూనే ఉంటారు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా వీటిపై చర్చించిన సందర్భాలు చాలా ఉన్నాయి.. వాళ్లకు క్లాస్ తీసుకున్న ఘటనలు లేకపోలేదు.. పనితీరు మెరుగుపర్చుకోకపోతే ఉపేక్షించేది లేదు అని వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే, ఫైన్ల క్లియరెన్స్ విషయంలో తన కేబినెట్‌లో ఏ మంత్రి.. ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.. డిసెంబర్ వరకూ ఫైళ్లు క్లియరెన్స్ లో మంత్రుల పనితీరు చదివి వినిపించారు.. అయితే, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో 6వ స్థానంలో తాను ఉన్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు.. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో మంత్రి ఫరూఖ్ ఉండగా.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10 స్థానంలో ఉంటే.. మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు..
ఫైళ్ల క్లియరెన్స్‌లో వరుసగా మంత్రుల స్థానాలు..
1. ఫరూఖ్
2. కందుల దుర్గేష్
3. కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్
5. డోలా బాలవీరాంజనేయ స్వామి
6. చంద్రబాబు
7. సత్యకుమార్ యాదవ్
8. నారా లోకేష్
9. బీసీ జనార్థన్ రెడ్డి
10. పవన్ కల్యాణ్
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. టీజీ భరత్
16. ఆనం రాం నారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారధి
24. పయ్యావుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్