NTV Telugu Site icon

Central Election Commission: సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..

Crda

Crda

Central Election Commission: రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఏపీ సీఆర్డీఏ.. అయితే, సీఆర్డీఏ రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది.. అయితే ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది.. కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈసీకి సీఆర్డీఏ లేఖ రాసిన విషయం విదితమే కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తర్వాత మాత్రమే రాజధాని టెండర్లను ఫైనలైజ్ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది.. దీంతో రాజధాని నిర్మాణ పనులు కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.. ఈ నెలలోనే రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావించింది ఏపీ ప్రభుత్వం.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది..

Read Also: AP Ministers Ranks: ఆరో స్థానంలో చంద్రబాబు.. పదో స్థానంలో పవన్‌ కల్యాణ్‌..

కాగా, గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ ఆ పనులను వేగవంతం చేసింది.. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశం నిర్వహించిన.. కొన్ని పనులు చేపట్టింది.. ప్రాధాన్యతా క్రమంలో రాజధాని ప్రాంతంలో పనులు వేగవంతం చేసింది.. అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకిగా మారిపోయింది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంతో పాటు కృష్ణా – గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది.. అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్‌ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ.. వివిధ జోన్ల పరిధిలో 14 వేల కోట్ల విలువైన పనులు చేపట్టాం.. ఎల్పీఎస్ లే ఔట్లలో రోడ్లు.. మంచినీటి సరఫరా.. డ్రైన్లు.. విద్యుత్‌ ప్లాంటేషన్.. ఇలా కొన్ని పనులు మొదలు పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిన నేపథ్యంలో.. ఈసీకి సీఆర్డీఏ లేఖ రాయగా.. టెండర్ ప్రక్రియకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికలు పూర్తి అయ్యాక మాత్రమే టెండర్లను ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.