Election Commission: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌పై స్పందించిన ఈసీ..
- ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై స్పందించిన ఈసీ..
- ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు..
- మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనం..
- ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మాజీ ఎమ్మెల్యే అరెస్టు ఒక గుణపాఠం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: ఈవీఎం ధ్వంసం, మరో మూడు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌పై స్పందించింది ఎన్నికల కమిషన్.. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే నిదర్శమని తెలిపింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా, ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఇంక ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈవీఎం డ్యామేజ్‌కు కారణమైన మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఈసీఐ ఆదర్శప్రాయమైన చర్యకు తార్కిక ముగింపు లభించింది. హోదాతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదనే సూత్రాన్ని ఇది బలపరుస్తుంది. ECI ఎన్నికల ప్రక్రియను పరిరక్షించడానికి కట్టుబడి ఉంది.. ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవటం ఎంతో ఆవశ్యకం. ఈవీఎంలను డ్యామేజ్ చేసిన వారిని అరెస్టు చేయడం అనేది ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడంలో ECI యొక్క అంకితభావానికి ఒక నిర్దిష్ట ఉదాహరణగా పేర్కొంది.
Read Also: Vidyasagar Rao: రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు..!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
- Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
- Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఏపీలో మే 13 వ తేదీన పోలింగ్ జరిగింది.. అయితే, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202 లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు (ఎమ్మెల్యే) ఉద్దేశపూర్వకంగా ఈవీఎం ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా మాత్రమే కాకుండా.. ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి ఈవీఎంలు మూల స్తంభాలు. అటువంటి ఈవీఎంలను పాడు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రత దెబ్బతింటుంది, ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది.. ఎన్నికల ఫలితాల చట్టబద్ధతపై సందేహాన్ని కలిగిస్తుంది. దేశంలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ).. ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణించింది.. ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన తర్వాత, ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని మే 21న ఈసీఐ ఆదేశించింది. ఈ సందర్బంగా మాచర్ల మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదైన ఈ కేసు నుండి తప్పించుకునేందుకు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషనను దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు నేడు ఆ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయంతో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!