Botsa Satyanarayana: రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి.. సభ్యులను గౌరవించాలి.. సభాపతికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.. మండలి చైర్మన్ మోషేన్ రాజుకు జరిగిన అవమానంపై వైసీపీ నిరసన చేపట్టింది.. నల్లకండువాలు ధరించి మండలికి హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్సీలు.. సభాపతికి ప్రోటోకాల్ పాటించారా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.. సీఎం క్షమాపణ చెప్పాలంటూ మండలిలో కోరారు వైసీపీ సభ్యులు.. ఇవాళ ఇదే అంశంపై మండలిలో కొనసాుతున్నాయి వైసీపీ నిరసనలు.. ఇక, మండలి ప్రారంభానికి ముందు మీడియాతో మా్లాడిన బొత్స.. రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను గౌరవించాలనేది మా డిమాండ్.. రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి.. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు.. ఇంతవరకు వాళ్ల వైపు నుంచి స్పందన కూడా రాలేదు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ జరగలేదు.. ఇది రాజ్యాంగబద్ధమైన అంశం అన్నట్లు కాకుండా వ్యక్తిగత విషయంలా చూడటం సరికాదని మండిపడ్డారు..
Read Also: Devara : JR. NTR దేవర 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం చైర్ లో కూర్చున్న వారికే కాదు ఎవరికి కులాలు ఆపాదించకూడదు అన్నారు బొత్స.. నందమూరి బాలకృష్ణ ప్రవర్తన సభలో అందరూ చూశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, మాజీ కేంద్ర మంత్రిని ఎలా మాట్లాడారో అందరూ చూసారు.. ప్రభుత్వ పెద్దలు, సభాపతి స్పందించి ఇప్పటికే మాట్లాడాలి.. అయినా ఇప్పటివరకు సభాపతి తనకు సంబంధం లేని విషయం అన్నట్లుగా ఉన్నారు.. సంబంధిత అధికారులను పిలిచి మండలి చైర్మన్ అవమానం విషయంలో ఏ జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయాలి కోరారు.. మొన్న జరిగిన ఘటనపై ఇంత వరకు స్పందించలేదు.. సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాలనేదే మా ఉద్దేశ్యం.. నిబంధనల ప్రకారం గౌరవం ఇవ్వాలి.. తీసుకోవాలి అన్నారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ..
