Botsa Satyanarayana: సంప్రదాయం ప్రకారం నేటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు.. కానీ, మీరు ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పుడు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. CAG అకౌంట్స్ ను నిర్ధారించగలిగేలా PACని రాజ్యాంగంలో చేర్చారు.. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా PAC ఇవ్వడం జరుగుతోందన్న ఆయన.. సంప్రదాయం కొనసాగిస్తారా..? ఒంటెద్దు పోకడతో వెళతారా చూడాలనే నామినేషన్ వేశామన్నారు.. తాలిబన్ల సంస్కృతి మనకు కావాలా..? అలాంటి సంస్కృతి పోషిద్దామా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజాస్వామ్యం లేదు.. అంతా మా ఇష్టారాజ్యమే అంటున్నారని దుయ్యబట్టారు.. ఇలాంటి సంప్రదాయాలు రాబోయే తరాలకు ఏం చెపుతాయి..? ఇనఅ నిలదీశారు.. అందుకే ఇలాంటి సంప్రదాయం తాము బాయ్ కాట్ చేస్తున్నాం అని వెల్లడించారు.. వాళ్ల అభిప్రాయం ప్రజలమీద రుద్దకూడదు.. పోటీకి మాత్రమే మేం దూరంగా ఉంటాం అన్నారు.. కౌన్సిల్ లో మాకు ఏకగ్రీవం కదా.. పదవి గురించి కాదు.. సంప్రదాయం కొనసాగించాలని సూచించారు బొత్స.. ఇక, పీఏసీ ఎన్నికల బహిష్కరణపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇంకా మీడియాతో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Botsa Satyanarayana: సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే పీఏసీ.. సభ్యుల సంఖ్యతో సంబంధంలేదు..
- సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి..
- CAG అకౌంట్స్ ను నిర్ధారించగలిగేలా PACని రాజ్యాంగంలో చేర్చారు..
- సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా PAC ఇవ్వాలన్న బొత్స..

Botsa Satyanarayana