NTV Telugu Site icon

Minister Satyakumar Yadav: ఢిల్లీలో బీజేపీ విజయం.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..

Minister Satyakumar Yadav

Minister Satyakumar Yadav

Minister Satyakumar Yadav: దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది.. బీజేపీ తిరుగులేని విజయాన్ని అందుకోవడంతో ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించినవారికి, ప్రచారంలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఆ పార్టీ నేతలు.. ఇక, ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు.. ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సత్యకుమార్‌.. ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా ఆప్ పార్టీ ముఖ్యనాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ఢిల్లీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.. అభివృద్ధి, సంక్షేమానికి అందలం ఎక్కించి, అవినీతి, అబద్ధాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పారన్నారు..

Read Also: Anshu: 15 ఏళ్లకే మన్మధుడు.. అందుకే ఇండస్ట్రీ వదిలేశా.. ఇప్పుడు ఎంట్రీ ఎందుకంటే?

ఇక, కాంగ్రెస్ సమాధిపై ఢిల్లీ ప్రజలు మరో రాయిని పేర్చారు అంటూ ఎద్దేవా చేశారు సత్యకుమార్‌.. బీజేపీకి పట్టం కట్టి దేశ రాజధానిని ఒక వికసిత్ ఢిల్లీగా తీర్చి దిద్దడానికి బాటలు వేసుకున్నారు.. ఢిల్లీ ప్రజలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ సారి బీజేపీని ఆదరించిన దక్షిణ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు.. గెలుపొందిన వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు బీజేపీ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్..