NTV Telugu Site icon

R. Krishnaiah: మరోసారి రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్య.. ఈ సారి బీజేపీ నుంచి..

Krishnaiah

Krishnaiah

R. Krishnaiah: ఆర్‌. కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు కృష్ణయ్య.. మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. హర్యానా నుంచి రేఖా శర్మ.. ఒడిశా నుంచి సుజీత్‌ కుమార్‌.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్‌. కృష్ణయ్యను అభ్యర్థులుగా ప్రకటించింది..

Read Also: Simran : 48 ఏళ్ల వయస్సులో జోరు చూపిస్తోన్న సిమ్రాన్

కాగా, ఏపీ నుంచి ఆర్‌.కృష్ణయ్యకు మరోసారి అవకాశం దక్కింది.. గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టిన కృష్ణయ్య.. దాదాపు రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.. అయితే, ఏపీలో వైసీపీ ఓటమి పాలు కావడంతో.. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ఆర్‌ కృష్ణయ్యతో బీజేపీ నేతలతో పాటు.. కూటమి నేతలు చర్చలు జరిపారు.. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఇక, నేను పూర్తిస్థాయిలో బీసీ సమస్యలపై ఉద్యమం చేస్తానని ప్రకటించారు కృష్ణయ్య.. కానీ, బీజేపీ జాతీయ నేతలు.. ఏపీ కూటమి నేతలు కూడా చర్చలు జరిపారు.. దీంతో.. ఆయన మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్న ఆర్‌.కృష్ణయ్యకు కూటమి పూర్తి మద్దతు ప్రకటించింది.. ఇక, దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్‌ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి..ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసిన విషయం విదితమే..

Show comments