APSRTC: ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే.. ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి.. మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం ఎంత దూరం..? ఏ రూట్‌లో వెళ్తే త్వరగా చేరుకుంటాం..? ఏ రూట్‌లో ఎన్ని గంటల సమయం పడుతుంది? లాంటి విషయాలు తెలుసుకుంటాం.. ఇక, అక్కడే బస్సు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా.. గూగుల్ మ్యాప్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అనుసంధానం కానున్నాయి.. దీని ద్వారా ప్రయాణికులు నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
Read Also: Mani Ratnam Next Movie: మణిరత్నం లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి-రుక్మిణి?
అయితే, ఇప్పటి వరకు ఆర్టీసీ ప్రయాణికులు బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, అధికారిక వెబ్‌సైట్ లేదా వివిధ యాప్‌ల ద్వారా ఆర్టీసీ టికెట్లను బుక్ చేసుకుంటుండగా.. ఈ జాబితాలో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా చేరనుంది.. అంటే, ఎవరైనా యూజర్ గూగుల్ మ్యాప్స్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నం లేదా మరో ప్రాంతానికి వెళ్లాలని సెర్చ్ చేస్తే.. ఇప్పటి వరకు కనిపిస్తోన్న కాలి నడక, కారు, బైక్, రైలుతో పాటు బస్సు ప్రయాణ వివరాలు కూడా కనిపించనున్నాయి.. అక్కడ బస్ సింబల్‌పై క్లిక్ చేయగానే, ఆ మార్గంలో అందుబాటులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల వివరాలు, అవి బయలుదేరే టైం, గమ్యస్థానానికి చేరే టై వంటి వివరాలు కనిపించనున్నాయి.. దీంతో, సదరు యూజర్ తనకు నచ్చిన బస్సును ఎంపిక చేసుకొని.. బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే, అది నేరుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లనుంది.. దీంతో ప్రయాణికుల అక్కడ తమ వివరాలు నమోదు చేసి, ఆన్‌లైన్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకునే వీలు ఉంటుంది.. అయితే, ఈ విధానాన్ని సుమారు 3 నెలల క్రితమే విజయవాడ – హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా పరీక్షించగా.. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించే విధంగా కసరత్తు సాగుతోంది..
