Minister Narayana: అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తా.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి నారాయణ.. అనంతవరం, నెక్కలు గ్రామసభల్లో పాల్గొన్నారు మంత్రి నారాయణ.. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి గ్రామ సభల్లో పాల్గొన్న మంత్రి, గ్రామస్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అలాగే, గ్రామ ప్రజల నుంచి సమస్యలు, సూచనలు స్వీకరించారు.
Read Also: Iran: భారత్‌ను అమెరికా వేడుకుంటోంది.. ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..
మంత్రి నారాయణ మాట్లాడుతూ, “గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అండర్ గ్రౌండ్ వాటర్, స్టార్మ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తాము. గ్రామ కంఠాల బయట ఉన్న మౌలిక సదుపాయాలతో సమానంగా గ్రామాల్లో నిర్మాణం జరుగుతుంది” అన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఇక, 2027 జూన్ నాటికి రాజధాని 360 కిమీ ట్రంక్ రోడ్లు, 1,500 కిమీ లేట్ అవుట్ రోడ్లు పూర్తి అవుతాయని, 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ భవనాలు పూర్తవుతాయని వెల్లడించారు మంత్రి నారాయణ..
