Site icon NTV Telugu

AP Secretariat: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సచివాలయంలో ప్రమోషన్లు

Ap Secretariat

Ap Secretariat

AP Secretariat: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతత్వంలోని కూటమి సర్కార్‌.. సచివాలయంలో పనిచేసే 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, 2023లో గత ప్రభుత్వం అనాలోచితంగా ఉత్తర్వులు ఇచ్చిందంటున్నారు.. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు వచ్చాయంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు.. ఆ తప్పిదాలు సరిదిద్ది ప్రమోషన్లు పునరుద్ధరిoచినట్టుప్రబుత్వ వర్గాలు చెబుతున్నాయి.. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ద్వారా 50 మంది అధికారులకు ప్రమోషన్ వచ్చింది.. త్వరలో మరో 100 – 150 మంది అధికారులకు కూడా ప్రమోషన్లకు మార్గం సుగమo అయ్యిందంటున్నారు.. మొత్తంగా 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లను ఇస్తూ.. మరో 150 మంది అధికారులకు ప్రమోషన్ల మార్గాన్ని క్లియర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్..

Read Also: Nacharam: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. ప్రైవేట్ పార్ట్స్‌పై తన్ని..!

Exit mobile version