Site icon NTV Telugu

AP Secretariat Security: ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు.. ప్రతీ వాహనం తనిఖీ.. ఐడీ కార్డ్స్‌ ఉంటేనే ఎంట్రీ..!

Ap Secretariat

Ap Secretariat

AP Secretariat Security: రాజధాని అమరావతి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.. విజయవాడలో మావోయిస్టులు అరెస్టు అయిన నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భద్రతా సడలింపులు కుదరకుండా పోలీసులు మరింత కచ్చితమైన విధానంలో భద్రతను పెంచారు. సచివాలయం మరియు పరిసర ప్రాంతాల్లో పోలీస్ విభాగాలు ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగుల ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ భద్రత పెంపు.. ముఖ్యంగా, మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారని సమాచారం రావడం కారణంగా చేపట్టారు..

Read Also: Droupadi Murmu Visits Tirumala: రాష్ట్రపతి తిరుమల పర్యటనలో ఆసక్తికర పరిణామం..

కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.. మరోవైపు, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. అయితే, విజయవాడలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో.. అప్రమత్తమైన పోలీసులు సచివాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు..

Exit mobile version