AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండో విడతలో మొత్తం 4,960 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో 4,960 మంది సర్పంచులు, 49,224 మంది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రెండో విడత ఎన్నికలకు ఎల్లుండి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. 23వ తేదీన అప్పీళ్లను పరిష్కరించనున్నారు. అనంతరం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇక, రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించి, అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు.
Also Read
- Child Trafficking: బాలల అక్రమ రవాణాకు చెక్..! అదృశ్యమైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్లాన్..
- Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
- AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
తాజావార్తలు
-
AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
PM Modi Manila Visit 2026: PM మోడీ మనీలా పర్యటన.. ఆసియాన్ సదస్సులో భారత్ ప్రధాన లక్ష్యాలివే
-
Astrology: నవంబర్ 16 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అన్నీ శుభాలే..!
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!