CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్ పంపిణీ చేయడంతో పాటు ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను మరింత పెంచాలని నిర్ణయించారు.
రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్ తక్కువ ధరకే..
సామాన్యులకు ఊరట కలిగించేలా డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పును రూ.100కే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే లీటరు పామాయిల్‌ను రూ.125కే అందించనున్నారు. కందిపప్పు ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 40,300 మెట్రిక్ టన్నుల కందుల సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read
- AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వానలు.. అలర్ట్ జారీ
- Karthika Pournami 2026: కార్తీక పౌర్ణమి శోభ.. వేములవాడ నుంచి శ్రీశైలం వరకు భక్తుల సందడి
- AP Deputy Mayor Elections: నేడు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల
- TDP : ఏపీలో 7 డిప్యూటీ మేయర్లు, 59 వైస్ చైర్పర్సన్ల జాబితా విడుదల..
ధరణి బియ్యం కేంద్రాలు 500కు పెంపు
ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ధరణి బ్రాండ్ బియ్యం విక్రయ కేంద్రాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 286గా ఉన్న విక్రయ కేంద్రాల సంఖ్యను 500కు పెంచనున్నారు. ధరణి బియ్యానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు ఈ బియ్యాన్ని కొనుగోలు చేయగా, మొత్తం 59,662 క్వింటాళ్ల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. ఇక, ధరణి బ్రాండ్ కింద మార్కెట్ ధరల కంటే తక్కువకే వివిధ రకాల బియ్యాన్ని విక్రయిస్తున్నారు. కిలో రూ.76 మార్కెట్ ధర ఉన్న KNM/RNR రకం బియ్యాన్ని రూ.50కే అందిస్తున్నారు. అలాగే కిలో రూ.66 మార్కెట్ ధర ఉన్న BPT రకం బియ్యాన్ని రూ.49కే విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు 8 నుంచి 18 శాతం వరకు తగ్గాయని అధికారులు తెలిపారు. ఉల్లి ధరలు 28 శాతం తగ్గగా, పామాయిల్ ధర లీటరుకు రూ.145కు తగ్గినట్లు వివరించారు.
రైతులకు మద్దతు ధర.. డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం
కందిపప్పు ధరలను నియంత్రించడంతో పాటు కంది సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు తెలిపారు. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
బ్లాక్ మార్కెట్‌పై నిరంతర నిఘా
మరోవైపు.. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడంపై నిరంతరం నిఘా ఉంచాలని సీఎం ఆదేశించారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే అధిక ధరల విక్రయాలపై 1,558 తనిఖీలు నిర్వహించి, 1,005 కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ విక్రయాలకు సంబంధించి రూ.84.59 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులు అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా సరిహద్దు చెక్‌పోస్టులు, టోల్గేట్ల వద్ద నిఘాను మరింత పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఏడాదిన్నర పాటు నిత్యావసర వస్తువుల మార్కెట్ ధరలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేశారు.
మొత్తంగా నిత్యావసర ధరలను నియంత్రించడం, సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు అందించడం, అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
-
CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..
-
Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!
-
Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!
-
IRCTC: వందే భారత్ ఫుడ్ మెనూలో మార్పులు చూశారా.. ఇకపై ఆ 4 ఐటమ్స్ మాత్రమే పెడతారట!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!