NTV Telugu Site icon

Property Tax Discount: గుడ్‌న్యూస్‌ చెప్పిన మున్సిపల్‌ శాఖ.. 50 శాతం రాయితీ..

Ap

Ap

Property Tax Discount: ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్‌ శాఖ అధికారులు.. ఈ నెలాఖరు వరకు అంటే 31 ఏప్రిల్‌ 2025 దాకా పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ మున్సిపల్‌ శాఖ.. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయిల ఆస్తి పన్ను వసూలు కోసం.. రాయితీపై నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కాగా, పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆర్థిక సంవత్సరం ముగింపులో కొన్నిసార్లు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ వస్తోన్న విషయం విదితమే.. ఇప్పటికే తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోనూ ఈ తరహా స్కీమ్‌ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ కూడా వడ్డీ రాయితీని ప్రకటించి.. చెల్లింపు దారులకు కొంత వరకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది.

Read Also: Rishabh Pant: రిషబ్ పంత్ తప్పిదాలు.. లక్నో ఓనర్ ఏమన్నాడంటే?