Site icon NTV Telugu

Minister Nara Lokesh: మరోసారి ఢిల్లీకి మంత్రి లోకేష్.. రేపు ప్రధాని మోడీతో భేటీ

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రి అక్కడే బస చేస్తారు.. ఇక, రేపు అనగా శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్.. యోగాంధ్ర నిర్వహణపై ప్రధానికి వివరించనున్నారు.. యోగాంధ్ర పై తయారు చేసిన బుక్‌ను ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఇక ప్రధాని మోడీతో సమావేశం తర్వాత.. రేపు తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు మంత్రి నారా లోకేష్‌. రేపు.. అమరావతిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు..

Read Also: BHU MTech Student Died: అర్ధరాత్రి వరకు చదువుకుని.. బీహెచ్‌యూలో పరీక్షకు ముందే విద్యార్థి మృతి..

మరోవైపు, ఇవాళ కేబినెట్‌ సమావేశానికి ముందు మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు.. డీఎస్సీకి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రికార్డు స్థాయిలో 16వేల పై చిలుకు పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామని తెలిపారు.. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని దుయ్యబట్టారు.. డీఎస్సీ అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.. కాగా, గతంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోడీతో లోకేష్ భేటీ అయిన విషయం విదితమే.. ఇక పలు సందర్భాల్లో కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన బిల్లులోని అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే..

Exit mobile version