Site icon NTV Telugu

Nara Lokesh Meet Chirag Paswan: చిరాగ్ పాశ్వాన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించండి..

Nara Lokesh Meet Chirag Pas

Nara Lokesh Meet Chirag Pas

Nara Lokesh Meet Chirag Paswan: ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ పర్యటన కొనసాగుతోంది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేష్.. ఆ తర్వాత.. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిశారు.. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు..

Read Also: YS Sharmila: జగన్, కేసీఆర్ ఎంత క్లోజ్ అంటే..? షర్మిల షాకింగ్‌ కామెంట్స్..

యువగళం పాదయాత్ర సందర్భంగా వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశాను అన్నారు నారా లోకేష్… ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలకు లోకేష్ కోరారు. దీనికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ… ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తాం. తిరుపతి ట్రిపుల్ ఐటీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి నేను ఏపీకి వస్తున్నాను. జులై 11, 12 తేదీల్లో రాయలసీమ పర్యటనకు వస్తున్నా. మీరు కూడా వస్తే క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దాం. అన్నదాతలకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ కు అందించారు మంత్రి నారా లోకేష్..

Exit mobile version