NTV Telugu Site icon

Minister Kondapalli Srinivas in New York: న్యూయార్క్‌లో ఏపీ మంత్రి పర్యటన.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ

Minister Kondapalli Sriniva

Minister Kondapalli Sriniva

Minister Kondapalli Srinivas in New York: న్యూయార్క్ లో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అయ్యారు.. ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు… వరదలు, కరువు నివారణకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై చర్చలు జరిపారు.. మైక్ వెబ్‌స్టర్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పని విధానాన్ని, పకృతి వనరులను కాపాడటంలో ఆయన కున్న చిత్తశుద్ధిని కొనియాడారు. గతంలో చిత్తూరు జిల్లాలో తమ బృందం పనిచేసిన అనుభవాన్ని, అప్పట్లో తమకు అందిన ప్రోత్సాహన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో తమకు అవకాశం అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు, కరువు నివారణ కోసం తప్పకుండా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: T20 World Cup 2024: టీమిండియా మహిళా క్రికెటర్లను కలిసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్!

ఇక, వరదలు, కరువు నివారణ చర్యలపై చేపట్టే ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని మైక్ వెబ్‌స్టర్ హామీ ఇచ్చారు. మైక్ వెబ్‌స్టర్ హామీ ఇవ్వడం పట్ల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. షెల్ ఫౌండేషన్ సీఈవో జోనాథన్ బెర్మాన్ మరియు పోర్ట్‌ఫోలియో అధిపతి మీరా షాతోనూ సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. సన్న, చిన్నకారు రైతులు, గ్రామీణ పేదరిక నిర్మూలన (SERP) కార్యకలాపాల గురించి చర్చలు జరిపారు.. వ్యవసాయం రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచడం కోసం, నూతన ఆవిష్కరణలను రావల్సిన అవసరాన్ని.. జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించారు మంత్రి శ్రీనివాస్.. సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకురావడంలో వారు ఎలా సహకరించాలి అనే విషయంపై చర్చించారు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్‌ పర్యటనపై ఆయన కార్యాలయం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.