AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎస్ఈసీతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి స్థానిక ఎన్నికలకు సంబంధించి సంసిద్ధత ప్రకటించడం, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ పూర్తికావడం, రిజర్వేషన్లపై నిర్ణయం రావడం, కోర్టు కేసులు తేలడం వంటి అంశాలు పూర్తయిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
అయితే ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు అనిల్ చంద్ర పునేఠా. ఎల్లుండి జరిగే సమావేశంలో ప్రధానంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన సంసిద్ధతపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సిద్ధమని ప్రకటించిన వెంటనే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు. గత ఎస్ఈసీ నీలం సాహ్ని రూపొందించిన ఓటర్ల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలకు సిద్ధమని ప్రకటిస్తే ఆ జాబితాను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఒకవేళ ఎస్ఐఆర్ పూర్తైన తర్వాత ప్రభుత్వం సంసిద్ధత తెలియజేస్తే ఏ ఓటర్ల జాబితాను అమలు చేయాలనే విషయంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటామని వెల్లడించారు.
Also Read
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు, 50 శాతం రిజర్వేషన్ అంశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపనున్నాయి. మొత్తం మీద ప్రభుత్వం నుంచి స్పష్టత, కోర్టు తీర్పులు, రిజర్వేషన్ల అంశం, ఓటర్ల జాబితాపై నిర్ణయం వంటి అంశాలు పూర్తయిన తర్వాతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!