AP Irrigation Election: నేడు ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, ఈ ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సాగునీటి సంఘాల ఎన్నికలపై కేంద్రపార్టీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకమని విమర్శించారు. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. పలుచోట్ల కూటమి పార్టీలకు చెందిన వారు దాడులకు కూడా తెగబడుతున్నారన్నారు. అభ్యర్థులకు ఎన్వోసీలు ఇవ్వడం లేదని మండిపడ్డారు..
Read Also: IND vs AUS: గబ్బాలో భారత్ బౌలింగ్.. వర్షంతో ఆగిన ఆసీస్ బ్యాటింగ్
నేడు సాగునీటి సంఘాలఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలోని ఆయన స్వగృహం నుంచి ఆయనను బయటికి రానికుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎంపీ తన ఇంటి నుంచి వైసీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడే కార్యకర్తలతో సమావేశమయ్యారు. నిన్న వేముల మండలంలో సాగునీటి సంఘాల ఎన్నికలలో పాల్గొనేందుకు రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వేముల తాసిల్దార్ కార్యాలయానికి వెళుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పులివెందులకు తరలించారు. దీంతో వేముల పోలీస్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసిపి సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించడంతో ఎన్నికలలో వైసిపి మద్దతుదారులు ఎవరూ పాల్గొనడం లేదు. అయినా నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు…
Read Also: Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు..
ఇక, ఇవాళ ప్రకాశం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ విభాగంలో 342 డబ్ల్యూయూఏలు, 2.10 లక్షల మంది ఓటర్లుగా ఆయకట్టు రైతులు ఉన్నారు.. ఇవాళ డబ్ల్యూయూఏలకు, 17న డీసీ లకు ఎన్నికలు జరగనుండగా.. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.. కడప జిల్లాలో 206, అన్నమయ్య జిల్లాలో 167 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.. అన్నమయ్య జిల్లాలో నేడు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్… తిరుపతి జిల్లాలో 610 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి.. రహస్య బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తారు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను వైసీపీ బహిష్కరించిన విషయం విదితమే..