Site icon NTV Telugu

IPS Officer Siddharth Kaushal Resigns: ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా… కారణం ఇదేనంటూ లేఖ..!

Siddharth Kaushal

Siddharth Kaushal

IPS Officer Siddharth Kaushal Resigns: ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు.. ఆయనకు ఇంకా సర్వీస్‌ ఉండగానే రాజీనామా చేశారు ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్.. స్వచ్ఛందంగా ఐపీఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా అంటూ లేఖలో పేర్కొన్నారు.. ఇది నా వ్యక్తిగత నిర్ణయం, ఎటువంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.. కొన్ని కథనాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అంటూ కొట్టిపారేశారు.. తన రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో పేర్కొన్నారు..

Read Also: 17 Days In 7 Rapes: బీజేపీ పాలిత రాష్ట్రంలో 17 రోజుల్లో 7 అత్యాచారాలు.. మహిళలకు భద్రత శూన్యం!

ఇక, తన జర్నీలో సహకరించిన ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్.. అంతే కాదు, రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు.. తాను ఐపీఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను రాష్ట్ర డీజీపీకి పంపినట్లు వెల్లడించారు.. తాను ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్) విద్యార్థిని.. తనకు మంచి ఆఫర్ రావడంతో ఈ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వివరణ ఇచ్చారు సిద్ధార్థ్ కౌశల్.. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను.. ఆంధ్రప్రదేశ్‌.. తనకు సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని చెప్పుకొచ్చారు సిద్ధార్థ్ కౌశల్…

Exit mobile version