AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఛార్జిషీట్‌లో అభ్యంతరాలు ఉండటంతో ఛార్జ్‌షీట్ వేసినట్టుగా పరిగణించలేదని ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులు సవాలు చేసింది సిట్.. అయితే ఛార్జిషీట్‌లో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినట్టు కోర్టుకు తెలిపింది సిట్.. ఛార్జ్‌షీట్ లో లోపాలను ఎత్తిచూపుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన అఫీషియల్ మేమెరండంపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసిది ఏపీ హైకోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ట్రయల్ కోర్టు పలు తెలిపిన అంశాలపై (ఫైండింగ్స్) స్టే ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు..
Read Also: Asia Cup 2025: ఒకే ఒక్క వికెట్.. చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్ సింగ్! తొలి భారత బౌలర్‌గా
మరోవైపు, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఏ-1 రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌లో సిట్‌కి నోటీసులు ఇవ్వాలంటూ.. విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఇక, ఏ-8 చాణక్య బెయిల్ పిటిషన్‌పై రేపు వాదనలు వినిపించాలంది కోర్టు. ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్‌ను రిటర్న్ చేసింది ఏసీబీ కోర్టు. ఇక.. లిక్కర్ స్కాం కేసులో ఏడుగురు నిందితుల రిమాండ్ రేపటితో పూర్తవుతుంది. ఆ ఏడుగురిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
