Site icon NTV Telugu

Kadambari Jethwani Case: ముంబై నటి జత్వాని కేసులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

Jethwani Case

Jethwani Case

Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.. అయితే, జత్వాని కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ .. ఇక, హైకోర్టులో జత్వానీ, పోలీసుల తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు.. బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు న్యాయవాది నర్రా శ్రీనివాస్.. మరోవైపు.. నిందితుడు తరుపు వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి.. నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైలులో ఉన్నాడని కోర్టుకు తెలిపారు విద్యాసాగర్ తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డి.. మంగళవారం రోజు కూడా కుక్కల విద్యాసాగర్‌ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి.. అయితే, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. ఈ రోజు కూడా ఈ కేసులో ఇరువర్గాల వాదనలు వింది.. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో.. కుక్కల విద్యాసాగర్‌ బెయిల్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.. ఈ నెల 9వ తేదీన కుక్కల విద్యాసాగర్‌ బెయిల్ పై ఆర్డర్స్ ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు..

Read Also: Agra: ప్రేమించినోడితో వెళ్లిపోయింది.. ఆస్తి కోసం కూతురు ఏం చేసిందంటే..! వీడియో వైరల్

Exit mobile version