NTV Telugu Site icon

Erra Matti Dibbalu: భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Erra Matti Dibbalu

Erra Matti Dibbalu

Erra Matti Dibbalu: విశాఖపట్నంలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై విమర్శలు వచ్చాయి.. పర్యావరణ ప్రేమికులు ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు.. అయితే, దీనిపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టులో పిల్ (WP(PIL) 155/2024) దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్.. దీనిపై విచారణ జరిగిన ఏపీ హైకోర్టు.. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్ధీకరణ మండలి (CRZ) జోన్-1, జోన్-3 మరియు వారసత్వ సంపద (జియో హెరిటేజ్) గల సున్నితమైన పరధిలోనికి వస్తుందని పేర్కొంది..

Read Also:Rashmi Gautham: దయచేసి నా వీడియోను వాడొద్దు.. యాంకర్‌ రష్మి విజ్ఞప్తి!

సంబంధిత ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు పొందకుండా నేరెళ్ల వలస గ్రామం సర్వే నెం:118/5A (పాత సర్వే నెం:49/1)లో ది భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివ్ బిల్డింగు సొసైటీ పనులు చేస్తోందని.. తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి మరియు వారసత్వ సంపద (జియో హెరిటేజ్) పరధిలో ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఎర్రమట్టి దిబ్బలు (కొండలు) తవ్వకాలు జరిపారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. జీవీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ను దృష్టిలో పెట్టుకొని ఎర్రమట్టి దిబ్బలను తవ్వి విధ్వంసం చేస్తున్న పనులను వెంటనే నిలుపుదల చేయాలని జీవీఎంసీకి మరియు ఇతర సంబంధిత శాఖలకు కూడా నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు..