Site icon NTV Telugu

AP High Court: విద్యాశాఖ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్‌.. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం..

Ap High Court

Ap High Court

AP High Court: హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఎయిడెడ్ విద్యాసంస్థలలో నియామకాలపై విద్యాశాఖ కమిషనర్‌ను వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది హైకోర్టు. అయితే, ఎయిడెడ్ విద్యా సంస్థలలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన నియమకాల విషయంలో విద్యాసంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. పాఠశాలలలో నియామకాలు చేపట్టాల్సిందిగా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను గతంలోనే జారీ చేసింది న్యాయస్థానం.. అయితే, ఈ ఉత్తర్వులను విద్యాశాఖ అమలు చేయని కారణంగా పాఠశాల యాజమాన్యాలు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.. విచారణ జరిపిన హైకోర్టు విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేసింది.. జులై 11వ తేదీన హైకోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది..

Read Also: Occult worship: క్రికెట్‌ స్టేడియంలో క్షుద్ర పూజలు.. నిలిచిపోయిన టోర్నమెంట్..!

Exit mobile version