Site icon NTV Telugu

Justice K Srinivas Reddy: ట్రోలింగ్స్..! హైకోర్టులో బెంచ్ మీదనే న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

Justice K Srinivas Reddy

Justice K Srinivas Reddy

Justice K Srinivas Reddy: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హైకోర్టులో బెంచ్ మీదనే న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.. గత వారం సింగయ్య కేసులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ పిటిషన్ ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన వ్యవహారంపై స్పందించిన ఆయన.. ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్‌ శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్ అని వ్యాఖ్యానించారు.. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్‌కు బాగా పనికి వస్తాయంటూ కామెంట్ చేశారు.. అయితే, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి.. తన ముందున్న బెయిల్ కేసుల అన్ని వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్‌రెడ్డి..

Read Also: Covishield: మా వ్యాక్సిన్లు సురక్షితం.. గుండెపోటు మరణాలపై కోవిషీల్డ్ మేకర్స్..

Exit mobile version